ప్రస్తుతం టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్లు కావలెను అనే మాట అంతటా వినిపిస్తోంది. నిన్నటివరకు ఓ ఊపు ఊపిన తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత.. వంటి వాళ్లు ఓల్డ్ అయిపోయారు. ఇప్పటికే వీరు తెలుగు యంగ్‌స్టార్స్ సరసన వరసగా చిత్రాలు చేశారు. మరలా వారినే తమ కొత్త సినిమాల్లోకి తీసుకుంటే ఆడియన్స్‌తో పాటు అందరూ బోర్‌గా ఫీలవుతారని అందుకోసం ఇప్పుడు అర్జంట్‌గా కొత్త హీరోయిన్లు కావలెను అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే 'జనతా గ్యారేజ్' చిత్రంతో పాటు రామ్‌చరణ్ నటించనున్న 'తని ఒరువన్' రీమేక్‌లో చరణ్ సరసస నటించే హీరోయిన్ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగుతోంది. తమిళం ఒరిజినల్‌లో జయం రవికి నయనతార హీరోయిన్‌గా నటించింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండటం, నయనతారనే తీసుకుంటే చరణ్ పక్కన అక్కలా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ భావిస్తుండటంతో ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలా? అని యూనిట్ ఆలోచనలో పడింది. ఇక కాజల్‌తో ఇప్పటికే రామ్‌చరణ్ నాలుగుసార్లు నటించాడు. ఇక సమంతతో ఎన్టీఆర్ కూడా నాలుగు సినిమాల్లో నటించాడు. ఇక అనుష్కను తీసుకుంటే ఆమె యంగ్‌హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు రావడం లేదు. కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆమె బిజీగా ఉంది. వీళ్లకే కాదు.. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. పవన్ తన 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో కాజల్‌తో సరిపెట్టుకుంటున్నాడు. మహేష్‌బాబు సైతం తన 'బ్రహ్మొత్సవం' సినిమాలో మరోసారి సమంత, కాజల్ అగర్వాల్‌లతో సర్దుకుపోతున్నాడు. మరి రకుల్ ప్రీత్‌సింగ్ వంటి మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఇప్పడు టాలీవుడ్‌కి అత్యవసరంగా కావాలి..!