Advertisementt

మెగాస్టార్‌ 150వ చిత్రంపై మరో రూమర్‌..!

Wed 18th Nov 2015 07:31 PM
chiranjeevi 150th film,ajith,vedalam remake,am rathnam  మెగాస్టార్‌ 150వ చిత్రంపై మరో రూమర్‌..!
మెగాస్టార్‌ 150వ చిత్రంపై మరో రూమర్‌..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150వ చిత్రం ప్రకటించే దాకా మీడియాలో, అభిమానుల్లో ఇదే పెద్ద చర్చనీయాంశంగా ఉంటూ ఎక్కడ ఏ సినిమా రిలీజై హిట్టయినా.. దాని రైట్స్‌ తీసుకొని చిరంజీవి సినిమా చేస్తారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా అలాంటి రూమరే ఒకటి గత కొద్దిరోజులుగా తమిళ సినీ వర్గాల్లో మొదలైంది. చిరంజీవి దృష్టి తాజాగా అజిత్‌ హీరోగా వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'వేదలమ్‌'పై కన్ను పడిందని, ఈమేరకు ఆయన ఆ నిర్మాత అయిన ఎ.యం.రత్నంను స్పెషల్‌ షో వేయమని చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఎ.యం.రత్నం నిర్మాతగా చిరంజీవి హీరోగా 'స్నేహం కోసం' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చిరు 150వ చిత్రంగా ఈ రీమేక్‌ ఎలా ఉంటుందని తన సన్నిహితులతో చిరు చర్చిస్తున్నట్లు కోలీవుడ్‌ మీడియా అంటోంది. మరి ఈ రూమర్‌ నిజమవుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! కాగా టాలీవుడ్‌ సర్కిళ్లలో మాత్రం మెగాస్టార్‌ 150వ చిత్రంపై వేరే రకమైన ప్రచారం జరుగుతోంది. వద్దు పొమ్మన్న దర్శకుడే ఇప్పుడు చిరంజీవికి దిక్కయ్యాడని, ఛీ కొట్టిన కథనే కళ్లకు అద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. రాజకీయాల్లోనే కాదు... సినిమాల్లోనూ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకు మరో ఉదాహరణ చిరంజీవి ఉదంతం అంటున్నారు. చిరు 150వ సినిమా కోసం పూరీజగన్నాథ్‌ 'ఆటోజానీ' అనే కథను సిద్దం చేశాడు. సెకండాఫ్‌ నచ్చకపోవడంతో పూరీ సినిమాను చిరు పక్కన పెట్టేశాడు. నీ కథని రిజెక్ట్‌ చేశామన్న మాట కూడా పూరీకి చెప్పలేదట. ఈ విషయంలో పూరీ చిన్నబుచ్చుకున్నాడు కూడా. పూరీని పక్కనపెట్టిన చిరు వినాయక్‌పై దృష్టి పెట్టాడు. 'అఖిల్‌' సినిమా పూర్తయిన తరువాత తన 150వ సినిమాని అతని చేతిలో పెడదామని అనుకొన్నాడు. అయితే ఈ సీన్‌ ఇప్పుడు రివర్స్‌ అయింది. 'అఖిల్‌' దెబ్బకు చిరు కూడా కామ్‌ అయిపోయాడు. 'అఖిల్‌' ఫ్లాప్‌భారం మొత్తం వినాయక్‌ నెత్తిన పడటంతో వినాయక్‌తో వర్కవుట్‌ కాదని.. ఇప్పుడు వినాయక్‌ని కూడా సైడ్‌ చేసినట్లు బోగట్టా. అంతేకాదు.. పక్కనపెట్టిన 'ఆటోజానీ' స్క్రిప్ట్‌నే మళ్లీ బూజు దులిపి దానిని కొత్తగా రాయిస్తున్నాడట. సంక్రాంతికి ఫైనల్‌ స్క్రిప్ట్‌ను చేతిలో పెట్టాలని చిరు డెడ్‌లైన్‌ ఇచ్చాడని, పూరీ కూడా అదే పనిలో ఉన్నాడని టాక్‌. సంక్రాంతి అంటే మరో రెండు నెలలు టైముంది. ఏమో.. ఈలోగా ఏమైనా జరగొచ్చు. చిరు మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు..? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ