Advertisementt

సర్దార్, ఇప్పట్లో తెగేలా లేదే

Wed 18th Nov 2015 03:13 PM
sardaar gabbar singh,pawan kalyan,bobby,gujarat shcedule  సర్దార్, ఇప్పట్లో తెగేలా లేదే
సర్దార్, ఇప్పట్లో తెగేలా లేదే
Advertisement
Ads by CJ

అప్పట్లో గబ్బర్ సింగ్ ప్రొడక్షన్ పనుల్లో ఎంతటి జాప్యం జరిగిందో ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోను అవే తప్పిదాలు దొర్లుతున్నాయి. కథ, దర్శకుడు ఎంపికలోనే ఏళ్ళు గడిపేసిన పవన్ కళ్యాణ్, ఇక షూటింగ్ మొదలయిన నాటి నుండి అటు రాజకీయం, ఇటు సినిమాను బ్యాలెన్స్ చేయడానికి శ్రమపడుతున్నారు. అందుతున్న తాజా సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ యావత్ యూనిట్ మొన్నీ మళ్లీ గుజరాత్ పయనమయింది. ఈసారి పవన్ కళ్యాణ్, దర్శకుడు బాబీతో పాటుగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా యాడ్ అయింది. రేపటి నుండి లాంగ్ షెడ్యూలు ప్రారంభమవుతుంది కాబట్టి ఇది నిరాటంకంగా కొనసాగితే మేజర్ టాకీ పార్ట్ పూర్తయినట్టేనట. అటు తరువాత మరో హైదరాబాద్ షెడ్యూలు కంప్లీట్ చేస్తే షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినట్టే. అంటే గుజరాత్లో ఓ నెల రోజులు, అటు తరువాత హైదరాబాద్ మరో పదిహేను రోజులు, ఆనక ప్యాచ్ వర్క్ ఓ పది రోజులు వేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు మరో నెలన్నర వేసుకున్నా సంక్రాంతికి కాదు కదా ఫిబ్రవరీకి కూడా క్లారిటీ వచ్చేలా లేదు. తంతు చూడబోతే సర్దార్ సంగతి ఇప్పట్లో తేలేలా లేదు. పవర్ ఫ్యాన్స్ ఇంకొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ