ముకుంద, కంచె చిత్రాల తర్వాత వరుణ్‌తేజ్ చేస్తున్న మరో వెరైటీ మూవీ లోఫర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ టోటల్‌గా కంప్లీట్ అయింది. రెండు క్లాస్ సినిమాల తర్వాత వరుణ్‌తో ఒక మాస్ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌గా చూపిస్తున్నాడు పూరి. ఈ చిత్రానికి బిజినెస్‌పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. నైజాం ఏరియాకి ఎంతో పోటీ ఏర్పడినప్పటికీ అభిషేక్ పిక్చర్స్ వారు లోఫర్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలిసింది. 7 కోట్ల 50 లక్షలకి అభిషేక్ పిక్చర్స్ నైజాం రైట్స్ కొన్నారట. దీన్ని బట్టి మిగతా ఏరియాల్లో ఈ చిత్రానికి బిజినెస్ ఏ రేంజ్‌లో వుంటుందో ఊహించుకోవచ్చు.
ముకుంద చిత్రం వరుణ్‌కి మంచి ఎంట్రీ ఇవ్వనప్పటికీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చింది. కంచె చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న వరుణ్ లోఫర్ చిత్రంలోని మాస్ క్యారెక్టర్‌తో అతనిలోని మరో యాంగిల్ చూపించేందుకు ట్రై చేస్తున్నాడు. నైజాం ఏరియాని ఫ్యాన్సీ ఆఫర్‌తో అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకోవడంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ టాక్ వుందని అర్థమవుతోంది.