Advertisementt

ఇంకెప్పుడు ఆవేశపడతారో?

Tue 17th Nov 2015 04:08 PM
ajith,vedalam,aavesham release,shruti hasan  ఇంకెప్పుడు ఆవేశపడతారో?
ఇంకెప్పుడు ఆవేశపడతారో?
Advertisement
Ads by CJ

తల అజిత్ హీరోగా, శృతి హసన్ హీరోయినుగా శివ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం వేదాలం సూపర్ హిట్టు టాక్ సొంతం చేసుకొని కాలీవుడ్ అంతటా రికార్డుల మోత మోగించింది. మాస్, ఫ్యామిలీ అంశాలను చక్కగా మిళితం చేసే శివ ఈసారి కూడా అజిత్ ఇమేజిని వాడుకోవడంలో విజయం సాధించాడు. రజినికాంత్  సూపర్ హిట్టు సినిమాల వసూళ్ళ రికార్డులను కూడా వేదాలం బ్రేక్ చేసి అభిమానుల్లో అసలు సిసలైన దీపావళి పండగ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి ఆవేశం పేరు మీద  తమిళంతో పాటే వదలాల్సింది. కానీ అఖిల్ లాంటి బడా తెలుగు చిత్రాల ప్రవాహంలో వీళ్ళ ఆవేశానికి అర్థం ఉండకపోవచ్చని ఆగిపోయారు  సదరు నిర్మాతలు. అరవ మార్కెట్టులో కూడా ఈ చిత్రానికి మెల్లిగా కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నందున వేదాలం అన్న క్రేజ్ తెలుగులో పూర్తిగా వదిలిపోకముందే ఆవేశాన్ని విడుదల చేస్తే బాగుంటుంది అన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. కమల్ హసన్ చీకటి రాజ్యం కూడా ఈ వారం రిలీజుకు సమాయత్తమయింది. వచ్చే వారం నుండి శంకరాభరణం, బెంగాల్ టైగర్, భలే మంచి రోజులు వరసలో వేచి ఉన్నాయి. ఇంతటి కాంపిటీషనులో అజిత్ బొమ్మకు గిరాకీ ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే అయినా ఎప్పుడో కాకుండా ఇప్పట్లోనే తొందరపడితే ఆవేశం కొంతమేర లాభపడవచ్చు అన్నది కూడా ఓ రకంగా ఉపయోగపడే వాదనే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ