ఈమధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్‌చరణ్‌ని బ్రూస్‌లీ పరాజయం మరింత కుంగదీసింది. ఇప్పటివరకు చరణ్ చేసిన 10 సినిమాల్లో జంజీర్‌ని మినహాయిస్తే అతని కెరీర్‌లో రీమేక్ చెయ్యలేదు. రీసెంట్‌గా తమిళ్‌లో పెద్ద హిట్ అయిన తని ఒరువన్ చిత్రం రీమేక్‌లో నటించాలని చరణ్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఇదిలా వుంటే ఇటీవల తమిళ్‌లో రిలీజ్ అయి అక్కడ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ఓ చిత్రం రీమేక్ రైట్స్‌ని చరణ్ తీసుకున్నాడట. చరణ్ రైట్స్ తీసుకున్నది స్టార్ హీరో నటించిన సినిమా కాదు. సీనియర్ కమెడియన్ గౌండమణి ప్రధాన పాత్రలో రూపొందిన ఒక లో బడ్జెట్ సినిమా. పి.అరోకియా దాస్ దర్శకత్వంలో కోటిన్నర లోపు బడ్జెట్‌లో రూపొందిన 49ఓ అనే చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ అయి ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా రైట్స్‌ని రామ్‌చరణ్ ఎందుకు తీసుకున్నాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ అయింది. పూర్తి రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో చరణ్ నటిస్తాడా? లేక ఈమధ్య స్టార్ట్ చేసిన వైట్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ కోసం ఆ సినిమా రైట్స్ కొన్నాడా? అనేది తెలియాల్సి వుంది. తన బేనర్‌లో చిన్న సినిమాలు కూడా నిర్మిస్తానని చెప్పిన చరణ్ 49ఓ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో తెలుగులో నిర్మించే ఆలోచనలో వున్నాడేమో. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా ఎనౌన్స్ చెయ్యాల్సి వుంది.