Advertisementt

అనుష్క..ఎందుకలా చేశావు!?

Tue 17th Nov 2015 11:52 AM
anushka,size zero,physic,rudramadevi,bahubali,anushka wait loss,heroine anushka,sweety  అనుష్క..ఎందుకలా చేశావు!?
అనుష్క..ఎందుకలా చేశావు!?
Advertisement
Ads by CJ

పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసి, శరీరాకృతులు మార్చుకునే కథానాయకులను మనం ఇప్పటి వరకు చూశాం. అయితే  బాలీవుడ్‌లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. క్యారెక్టర్ కోసం ఫిజిక్‌ను మార్చుకోవడం అక్కడ అలవాటే. అయితే టాలీవుడ్‌లో మాత్రం పాత్ర కోసం రిస్క్ తీసుకునే హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా లేరనే మాట వాస్తవం. అయితే  అనుష్క మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పొచ్చు. హీరోలతో పాటు సమానమైన గుర్తింపును దక్కించుకున్న అనుష్క.. ఇటీవల రుద్రమదేవి కోసం గుర్రపుస్వారీ, కత్తియుద్దాలు నేర్చుకోవడంతో పాటు.. ఫిజిక్‌ను కూడా మార్చుకుంది. అయితే అందుకు తగ్గ ప్రశంసలు ఆమె పొందింది. కానీ ఆమె సైజ్‌జీరో చిత్రం కోసం బరువు పెరగడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పాత్ర కోసం తన అందమైన ఫిజిక్‌ను పాడు చేసుకుందని ఆందోళన చెందుతున్నారు. అయితే సైజ్‌జీరో కోసం బరువు పెరిగిన ఆమె ఇప్పటికి తన మునుపటి అందాన్ని, ఫిజిక్‌ను పొందలేకపోతుంది. అందుకే ఆమె అభిమానులు పెద్దగా ఆసక్తిలేని పాత్ర కోసం అనుష్క మోహమాటానికి పోయి, కథను అంగీకరించి, రిస్క్ చేసిందని భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ