వైవిధ్యమైన చిత్రాలతో పయనం కొనసాగిస్తున్న నిఖిల్ తాజాగా కోనవెంకట్ నిర్మాగా..రచయితగా రూపొందిన ‘శంకరాభరణం’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సెన్సారుతో సహా అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే మొదట్లో ఈ చిత్రాన్ని నవంబరు 20న లేదా 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కోన వెంకట్ ‘అఖిల్’ చిత్రం కోసం తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ట్విట్టర్‌లో ప్రకటించాడు. అఖిల్ చిత్రానికి కోనవెంకట్ బృందం రచయితలుగా పనిచేసింది. అంతేకాకుండా నాగార్జున, నాగచైతన్య నటిస్తున్న సినిమాలకు కూడా కోన రచయితగా పనిచేస్తున్నాడు. అందుకే నాగ్ దగ్గర తన రిలేషన్ కాపాడుకోవడానికి శంకరాభరణంను వాయిదా వేశాడు. అయితే అఖిల్ ఫ్లాప్ అవ్వడంతో.. ఇలాంటి సినిమా కోసం తన సినిమాను వాయిదా వేసి సినిమాపై వున్న క్రేజ్‌ను కోన కిల్ చేశాడని నిఖిల్ సన్నిహితులతో వాపోతున్నాడట. తన స్వార్థం కోసం తన సినిమాకు కోన లాస్ చేశాడని నిఖిల్ ఫీలవుతున్నాడట.