Advertisementt

బిజీ బిజీగా నారా రోహిత్‌!

Mon 16th Nov 2015 10:12 PM
nara rohit,banam,solo,savithri,raja cheyyi vesthe movies  బిజీ బిజీగా నారా రోహిత్‌!
బిజీ బిజీగా నారా రోహిత్‌!
Advertisement
Ads by CJ

తొలిచిత్రం 'బాణం' నుండి విల‌క్ష‌ణ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్. 'సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, అసుర' చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తూ అందులో కొత్త టెక్నిషియ‌న్స్‌, ద‌ర్శ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు.  నారా రోహిత్ ప్ర‌స్తుతం 'రాజా చెయ్యివేస్తే', 'సావిత్రి' సినిమాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ను జ‌రుపుకుంటున్నాయి. 'రాజా చెయ్యివెస్తే' సినిమా నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో సాయికొర్ర‌పాటి నిర్మాత‌గా వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై రూపొందుతుండ‌గా, 'సావిత్రి' సినిమావిజ‌న్ ఫిలింమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ నిర్మాత‌గా ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాలు ఓకే స‌మ‌యంలో జ‌రుగుతుండటంతో నారా రోహిత్ ఉద‌యం ఆరు గంట‌ల నుండి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు 'రాజా చెయ్యివేస్తే' చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. అలాగే సాయంత్రం ఆరు గంట‌ల నుండి మ‌రుసటి రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌ వ‌ర‌కు 'సావిత్రి' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నారా రోహిత్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌టం ఆయ‌న‌కు సినిమా ప‌ట్ల ప్యాష‌న్‌, డేడికేష‌న్‌ను తెలియ‌జేస్తున్నాయి. నిర్మాత‌ల మేలు కోరే ఇలాంటి హీరోలే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి కూడా అవ‌స‌రం

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ