Advertisementt

బ్లాక్‌ బస్టర్‌ ప్రొడ్యూసర్‌ మళ్ళీ వచ్చేస్తున్నాడు.!

Mon 16th Nov 2015 07:51 PM
hero nithin,producer bandla ganesh,hero nithin with bandla ganesh,nithin latest movie aa aa,after long gap producer bandla ganesh doing a movie  బ్లాక్‌ బస్టర్‌ ప్రొడ్యూసర్‌ మళ్ళీ వచ్చేస్తున్నాడు.!
బ్లాక్‌ బస్టర్‌ ప్రొడ్యూసర్‌ మళ్ళీ వచ్చేస్తున్నాడు.!
Advertisement
Ads by CJ

ఆరేళ్ళ క్రితం రవితేజ హీరోగా ఆంజనేయులు చిత్రాన్ని నిర్మించడం ద్వారా నిర్మాతగా మారిన కమెడియన్‌ బండ్ల గణేష్‌ ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి టాప్‌ హీరోలతో సినిమాలు తీసి స్టార్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయాడు. గత సంవత్సరం టెంపర్‌ చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టి మంచి ఊపు మీదున్న గణేష్‌ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. సాధారణంగా ఒక దాని వెంట మరొకటి అన్నట్టుగా సినిమాలు చేసే గణేష్‌ ఇంత గ్యాప్‌ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎంత పెద్ద హీరోతో సినిమా తీసినా, ఎలాంటి సినిమా తీసినా ప్రతి క్షణం ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది అంటూ జపం చేసే బండ్ల గణేష్‌ ఈసారి నితిన్‌తో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. 

చిన్నదాన నీకోసం, కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ వంటి ఫ్లాప్‌ మూవీస్‌తో వెనకబడి పోయిన నితిన్‌తో ఓ భారీ చిత్రం చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాడు గణేష్‌. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో నితిన్‌ చేస్తున్న అ.. ఆ చిత్రం పూర్తవగానే బండ్ల గణేష్‌ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ