ఆమధ్య ఫ్యామిలీతో కలిసి విదేశాలు వెళ్లి రిలాక్స్ అయ్యాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. 'బ్రహ్మొత్సవం' షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి మరీ వెకేషన్స్‌కు వెళ్లాడు. ఇక ఇప్పుడు దసరా, దీపావళి పండగల జోరు ముగియడంతో మరలా 'బ్రహ్మొత్సవం' షూటింగ్‌లో బిజీ అయ్యాడు. గత వారమే ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. మహేష్‌బాబుతో పాటు కాజల్ అగర్వాల్‌ల మద్య కీలకసన్నివేశాల చిత్రీకరణతో పాటు, మహేష్‌బాబు, సత్యరాజ్, జయసుధలపై కొన్ని సీన్స్‌ను రామోజీఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇక మరో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత జనవరి నుండి ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తుండటంతో ఇందులో తమిళ నాట ఫేమస్ అయిన నటీనటులను కూడా చాలా పాత్రలకు ఎంపికచేసుకున్నారు.