అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రం 'అఖిల్' కోసం శక్తిమేర కష్టపడ్డాడు. అతని కష్టం అంతా తెరపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా డాన్స్‌లు, ఫైట్స్ విషయంలో ఇరగదీశాడు. ఇన్నాళ్లు షూటింగ్‌లతో విరామం లేకుండా గడిపిన అఖిల్ సినిమా విడుదల అయిన తర్వాత తన స్నేహితులతో కలిసి గోవా టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఆయన ఓ వారం గడపనున్నాడు. ఈమధ్య చాలామంది స్టార్స్ షూటింగ్‌లు ముగిసిన తర్వాత వెకేషన్స్‌కు వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అఖిల్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. ఇక ఆయన చేయబోయే రెండో సినిమా గురించి అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ డైరెక్టర్లందరూ బిజీగా ఉన్నారు. మరో రెండు నెలలు గడిస్తే కానీ ఎవ్వరూ ఫ్రీ కారు. ఈ రెండు నెలల పాటు స్టోరీలు వింటూ ఉండాలని అఖిల్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ రెండో సినిమాను నాగార్జున తమ సొంతబేనర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో గానీ లేదా సొంత బేనర్ వంటి కామాక్షి మూవీస్ బేనర్‌లో గానీ చేసే అవకాశం ఉందని సమాచారం.