Advertisementt

నీకు నేను, నాకు నువ్వు... రామ్, వైట్ల

Mon 16th Nov 2015 04:12 PM
srinu vytla,ram,ready,bruce lee  నీకు నేను, నాకు నువ్వు... రామ్, వైట్ల
నీకు నేను, నాకు నువ్వు... రామ్, వైట్ల
Advertisement
Ads by CJ

శ్రీను వైట్లలో విషయం ఎంతుంది అన్నది పక్కనెడితే చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అపూర్వమైన చాన్సులను కొట్టేసిన ఘనత ప్రస్తుత టాలివుడ్ దర్శకుల్లో ఈయన ఒక్కడికే దక్కింది. కానీ ఏం చేస్తాం, బ్రూస్ లీ అండ్ ఆగడుల పరాజయాలతో వైట్ల అక్కడే ఆగిపోయాడు. మెగా అభిమానుల వేడిని తట్టుకోలేకపోయిన వైట్ల గత కొద్ది రోజులుగా సిటీ విడిచి ఫ్యామిలీతో ఔటింగుకి వెళ్ళారంటే ప్రెజర్ ఏ లెవెల్లో ఉందొ అంచనా వేసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం మొన్నే హైదరాబాద్ నగరంలో మళ్ళీ కాలు మోపిన శ్రీను, వచ్చీరాగానే సరాసరి తన తదుపరి ప్రాజెక్టు పనుల మీద కూర్చున్నాడు. ఇప్పుడిప్పుడే బడా స్టార్ హీరోల జోలికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో పోతినేని రామ్ హీరోగా వైట్ల ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. పండగ చేస్కోతో ఊపిరి పీల్చుకున్న రామ్ కూడా శివమ్ దెబ్బతో కుదేలయ్యాడు. హరికథను మార్చి నేను శైలజ అనే సినిమా చేస్తున్న రామ్ మాత్రం శ్రీను వైట్లతో అనేసరికి ఎగిరి గంతేసి మరీ సినిమా ఒప్పుకున్నాడట. ఎంతైనా రెడీ లాంటి సూపర్ హిట్టును ఇచ్చిన కాంబినేషన్. అంత తేలిగ్గా తీసి పారేయలేము కదా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ