Advertisementt

మళ్ళీ నిద్ర లేస్తున్న నిర్మాత

Mon 16th Nov 2015 01:46 PM
bellamkonda suresh,sai sreenivas,alludu seenu  మళ్ళీ నిద్ర లేస్తున్న నిర్మాత
మళ్ళీ నిద్ర లేస్తున్న నిర్మాత
Advertisement
Ads by CJ

కొడుకును స్టార్ హీరోగా నిలబెట్టుకోవాలన్న ఏకైక తపనతో నిర్మాత బెల్లంకొండ సురేష్ డబ్బును నీళ్ళ కన్నా అధ్వాన్నంగా ఖర్చు చేసిన సినిమా అల్లుడు శీను. స్టార్ దర్శకుడు వినాయక్ చేతుల్లో రూపం పోసుకున్న ఈ చిత్రం హీరోగా సాయి శ్రీనివాస్ నిలబడడానికి పెద్దగా తోడ్పడింది ఏమీ లేదు. పైగా అల్లుడు శీను, రభసల పుణ్యమాని బెల్లంకొండ సురేష్ వివాదాల్లో కూరుకుపోయాడు. డబ్బులు ఎగ్గోట్టాడని ఎందఱో ఫైనాన్సియర్స్ ఈయన పట్ల గుర్రుగా ఉన్నారన్నది తెలిసిందే. హిట్టు, ఫ్లాప్... లాభాలు, నష్టాలు అన్నవి సినిమాలతో ఎప్పుడు ముడిపడి ఉండేవి . ఇక ఈ సమస్యలు అన్నింటి నుండీ తప్పించుకుని గంగతో కొద్దిపాటి అప్పులు తీర్చేసినా సాయి శ్రీనివాస్ రెండో చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రావాల్సింది, కానీ అక్కడే బ్రేకులు పడి ఆగిపోయింది. ఇక జరిగిన నష్టానికి ఎక్కడికక్కడ సెటిల్మెంట్స్ చేసుకున్న బెల్లంకొండ మళ్ళీ నిద్ర లేచాడు. భీమనేని శ్రీనివాస్, విజయ్ కుమార్ కొండల దర్శకత్వంలో కొడుకు సాయి శ్రీనివాస్ హీరోగా రెండు సినిమాలను మొదలెట్టి షూటింగ్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెలుతున్నాడు. హీ ఈజ్ బ్యాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ