నవంబర్ నెల అంటేనే సినిమా వాళ్లకు హడల్. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర షాక్ తప్పదనే ఓ అపోహ ఎప్పటి నుండో ఉంది. అదే డిసెంబర్ నెల పట్ల పాజిటివ్ దృక్పదం ఉంటోంది. కానీ ఆ నెగెటివ్ సెంటిమెంటును తోసిరాజని అనుష్క, ఆర్యాలు నటించిన సైజు జీరోను పోటాపోటీగా విడుదలకు సమాయత్తం చేసారు దర్శక నిర్మాతలు. అఖిల్ విషయంలో కూడా ఇటువంటి తప్పు జరిగిందని అక్కినేని అభిమానులు విశ్లేషణ జరుపుతున్న సమయంలోనే సైజు జీరోకు సర్వం సిద్ధం అయిపొయింది. పైగా ఎప్పటి నుండో విడుదలకు నోచుకోకుండా ఉన్న ఈ మూవీకి ఇదే కరెక్ట్ సమయం అనుకుంటున్నారు నిర్మాత ప్రసాద్ పోట్లురి. నవంబర్ సెంటిమెంటుకు తోడు సినిమా టైటిలులోనే జీరో పెట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఎలా హీరో అవుతారు అన్నది ఇంకో టాక్. తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజవుతున్న సైజు జీరోకు ప్రేక్షకులు ఎలాంటి తీరుపును ఇస్తారో వెయిట్ అండ్ సీ.