నవంబర్ 14న పారిస్‌లో జరిగిన మారణహోమం షాక్ నుంచి ప్రపంచ ప్రజలు ఇంకా తేరుకోలేదు. ముఖ్యంగా పారిస్‌లోని ప్రజలు ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ చనిపోయిన ప్రజల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాయి. పారిస్‌లో దుర్ఘటన జరిగిన సమయానికి ముందు కొంత మంది ఇండియాలోని ప్రముఖులు కూడా అక్కడ వుండడం, ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడం అందరికీ తెలిసిన విషయమే.
సూపర్‌స్టార్ మహేష్ తన ఫ్యామిలీతో చాలా రోజుల నుంచి పారిస్‌లోనే వున్నాడు. ఇటీవలే అక్కడి నుంచి తిరిగొచ్చిన మహేష్ జరిగిన సంఘటన గురించి విని షాక్‌కి గురయ్యాడు. చనిపోయిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశాడు. అంతే కాకుండా పారిస్ శాంతి భద్రతలతో వుండాలని, అక్కడి ప్రజలకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ప్రే ఫర్ పారిస్ అని రాసి వున్న ఒక ఇమేజ్‌ని పోస్ట్ చేశాడు. పారిస్ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల ప్రజలకు వుందని మహేష్ అంటున్నాడు.