Advertisementt

ఆ 'ఫోటో'ను అంజలి మర్చిపోలేదు!

Mon 16th Nov 2015 11:48 AM
anjali,photo movie siva nageswararao,anjali 1st movie photo,anjali at siva nageswara rao daughter wedding  ఆ 'ఫోటో'ను అంజలి మర్చిపోలేదు!
ఆ 'ఫోటో'ను అంజలి మర్చిపోలేదు!
Advertisement
Ads by CJ

సినీ రంగంలోకి రావాలని.. తమ ప్రతిభను నిరూపించుకోవాలని తహతహలాడే వారు తమకు తొలి అవకాశం కల్పించిన వారిని దేవుడితో సమానంగా చూస్తారు. తొలి అవకాశం సద్వినియోగం చేసుకుని స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత కొంత మంది మాత్రమే తమకు తొలిఛాన్స్ ఇచ్చిన వాళ్లను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు అలాంటి కోవలో హీరోయిన్ అంజలి కూడా చేరింది. ‘ఫోటో’ చిత్రం ద్వారా అంజలిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు దర్శకుడు శివ నాగేశ్వరరావు. అయితే ప్రస్తుతం దర్శకుడిగా అతను పెద్దగా ఫామ్‌లో లేడు. అతని దర్శకత్వంలో సినిమా వచ్చి కూడా చాలా సంవత్సరాలైంది. కానీ ప్రస్తుతం అగ్రకథానాయికల్లో ఒకరిగా వున్న అంజలి మాత్రం తనకు తొలిఛాన్స్ ఇచ్చిన  శివ నాగేశ్వరరావును మరిచిపోలేదు. ఈ ఆదివారం జరిగిన శివ నాగేశ్వరరావు కూతురు వివాహా వేడుకకు అంజలి హాజరై శుభాకాంక్షలు అందజేసింది. ఇది చూసిన వాళ్లంతా అంజలి సూపర్ కదా!..అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ