Advertisementt

మంచు విష్ణు ఈసారి మాములుగా రావట్లేదు!

Mon 16th Nov 2015 11:37 AM
manchu vishnu,raj tarun,nageswara reddy,manchu vishnu with raj tarun,manchu vishnu new movie  మంచు విష్ణు ఈసారి మాములుగా రావట్లేదు!
మంచు విష్ణు ఈసారి మాములుగా రావట్లేదు!
Advertisement
Ads by CJ

వరసగా సినిమాలు అయితే చేస్తున్నప్పటికీ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు హిట్లే ఉన్న హీరో మంచు విష్ణు. ఆయన తన సొంత బేనర్‌లో తానే నిర్మాతగా వరుసగా సినిమాలు తీస్తూ ఎప్పటికైనా పెద్ద హిట్‌ కొట్టకపోతానా? అనే ఆశతో ఉన్నాడు. ఈసారి మాత్రం ఆయన సోలోగా రాకుండా యంగ్‌ హీరోల్లో మంచి ఊపు మీదున్న రాజ్‌తరుణ్‌ను వెంట తీసుకొని వస్తున్నాడు. రాజ్‌తరుణ్‌తో కలిసి ఈ చిత్రంలో విష్ణు నటించనున్నాడు. అయితే ఈ సినిమాను మల్టీస్టారర్‌ అనలేము గానీ మల్టీహీరోల చిత్రం అని మాత్రం అనవచ్చు. చాలాకాలం కిందట మంచు విష్ణు ఓ పంజాబీ సినిమా రైట్స్‌ను తీసుకున్నాడు. దీనికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో మంచు విష్ణుకు సరితూగే సమానమైన పాత్రను పోషించనున్నాడు రాజ్‌తరుణ్‌. ఈ చిత్రానికి నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఈచిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని విష్ణు తన సొంత బేనర్‌ అయిన 24ఫ్రేమ్స్‌ పతాకంపై స్వయంగా నిర్మించనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ