మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్' రీమేక్‌ను నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మించనున్న సంగతి తెలిసిందే. దాదాపు ప్రీపొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈచిత్రంలో శృతిహాసన్ లెక్చరర్ పాత్రను పోషిస్తుంటే ఆమె స్టూడెంట్‌గా నాగచైతన్య నటిస్తున్నాడు. 'శ్రీమంతుడు'లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శృతిహాసన్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. సాయిపల్లవి అనే క్యారెక్టర్‌కు స్పెషల్ మేకోవర్ చేసే పనిలో శృతి బిజీగా ఉంది. కాగా 'ప్రేమమ్' ఒరిజినల్ వెర్షన్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగు రీమేక్ 'మజ్ను'లో కూడా అదే పాత్ర చేయనుండటం విశేషం. మొత్తానికి ఇప్పుడు నాగచైతన్య దృష్టి మొత్తం 'మజ్ను' పైనే ఉందని చెప్పాలి...!