ప్రస్తుతం అందరూ 'ప్రేమ్' నామజపం చేస్తున్నారు. సల్మాన్‌ఖాన్ నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' చిత్రాన్ని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 5700ల థియేటర్లలో విడుదల చేశారు. దాంతో ఈ చిత్రం ఇప్పటివరకు 'హ్యాపీ న్యూఇయర్' పేరున ఉన్న మొదటిరోజు హయ్యస్ట్ కలెక్షన్ రికార్డులపై కన్నేసింది. కాగా 'హ్యాపీ న్యూఇయర్' చిత్రం మొదటిరోజు 44.97కోట్లను వసూలు చేసింది. ఈ రికార్డును అధిగమించాలని ఈ ఏడాది మొదటి సారి చేసిన 'భజరంగీభాయిజాన్' ప్రయత్నంతో పాటు తాజాగా చేసిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' చిత్రం కూడా ఆ రికార్డును కొల్లగొట్టలేకపోయాయి. 'ప్రేమ్‌రతన్ ధన్ పాయో' చిత్రం మొదటిరోజున 40కోట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో సల్మాన్‌తో పాటు ఆయన అభిమానులు కూడా కాస్త అసంతృప్తికి లోనయ్యారు. కాగా ఇప్పుడు షార్‌ఖ్‌ఖాన్ తన పేరిట ఉన్న రికార్డును తిరిగి తానే తిరగరాయాలని భావిస్తున్నాడు. డిసెంబర్ 18న విడుదలకు సిద్దమవుతోన్న 'దిల్‌వాలే' చిత్రంతో ఆయన 45 కోట్లను తొలిరోజు సాధించి తన రికార్డును తానే తిరగరాయాలనుకుంటున్నాడు. మొత్తానికి ఈ 'హ్యాపీ న్యూ ఇయర్' రికార్డును ఎవరు బద్దలు కొడతారో వేచిచూడాలి....!