వరసగా ఎన్నో ఫ్లాప్‌లు రుచిచూసిన నితిన్ మరలా 'ఇష్క్' సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ స్టడీగా సాగుతోంది. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, వినాయక్, పూరీజగన్నాథ్ వంటి వారి దర్శకత్వంలో నటించినప్పటికీ ఆయన మార్కెట్ 25కోట్ల లోపే. ఆయన ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో 'అ..ఆ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత, నదియా వంటి భారీ తారాగణం నటిస్తోంది. చాలా మంది స్టార్ హీరోలకు దొరకని డైరెక్టర్.. నితిన్‌కు దొరకడం అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రం ప్రారంభమైనప్పుడు అందరూ దీనిని ఓ లోబడ్జెట్ చిత్రంగా ఉంటుందని భావించారు. కానీ త్రివిక్రమ్ మాత్రం దీనిని పెద్ద సినిమా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ ఏకంగా 35కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా 40కోట్లను దాటాలని నితిన్‌తో పాటు త్రివిక్రమ్ భావిస్తున్నాడు. నితిన్ మార్కెట్‌ను 40కోట్లకు చేర్చే దిశగా త్రివిక్రమ్ అడుగులు పడుతున్నాయి. ఈ చిత్రాన్ని సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. భారీ తారాగణానికి తోడు టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇలా నితిన్ రేంజ్‌ను పెంచే పనిలో త్రివిక్రమ్ తలమునకలై ఉన్నాడు. మరి 'అ..ఆ..' చిత్రం బడ్జెట్ కి తగ్గట్లుగా..టార్గెట్ 40కోట్లను చేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది!