నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) అల్లు అర్జున్, త్రివిక్రమ్ రెండు భారీ చిత్రాలు తీసి సక్సెస్‌ఫుల్ నిర్మాత అయిపోయాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌తో మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 16న ప్రారంభం కాబోతోంది. దృశ్యం, గోపాల గోపాల వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో మరో విభిన్న చిత్రమవుతుందని నిర్మాత చెప్తున్నారు.
వెంకటేష్ ఇమేజ్‌కి, అతని ఏజ్‌కి తగ్గ సబ్జెక్ట్‌ని మారుతి రెడీ చేయడం, ఆ సబ్జెక్ట్ వెంకటేష్‌కి విపరీతంగా నచ్చడం జరిగిపోయాయి. భలే భలే మగాడివోయ్ చిత్రంతో మారుతిలోని కొత్త డైరెక్టర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో సినిమా చేసే ఆలోచనలో వెంకటేష్ వున్నప్పటికీ భలే భలే మగాడివోయ్ చిత్రం చూసిన తర్వాత పక్కాగా డిిసైడ్ అయినట్టు సమాచారం. మారుతి అంతకుముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమాగా భలేభలే మగాడివోయ్ చిత్రాన్ని రూపొందించడం, అది సూపర్‌హిట్ అవ్వడంతో మారుతికి డైరెక్టర్‌గా కొత్త ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ కాంబినేషన్‌లో చెయ్యబోతున్న చిత్రంతో మారుతికి డైరెక్టర్‌గా ఎలాంటి రేంజ్ వస్తుందో చూడాలి.