Advertisementt

పవన్‌ పాటలకు రాజశేఖర్‌ స్టెప్పులు..!

Sat 14th Nov 2015 07:52 PM
pawan kalyan,gabbar singh movie,rajasekhar,deepavali celebrations  పవన్‌ పాటలకు రాజశేఖర్‌ స్టెప్పులు..!
పవన్‌ పాటలకు రాజశేఖర్‌ స్టెప్పులు..!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీతో రాజశేఖర్‌, జీవిత దంపతులకు చాలాకాలంగా రిలేషన్‌ షిప్‌ బాగోలేదనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో పలు సందర్బాల్లో చిరంజీవిపై, పవన్‌కళ్యాణ్‌పై జీవిత, రాజశేఖర్‌ దంపతులు ఘాటు విమర్శలు సైతం చేశారు. అయితే కాలక్రమేణ ఇరు వర్గాలు కూల్‌ అయ్యాయి. గతంలో జీవిత,రాజశేఖర్‌ దంపతులు పవన్‌ మీద విమర్శలు చేయడం, పవన్‌ కూడా తన మూవీ 'గబ్బర్‌సింగ్‌'లో రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేస్తూ సెటైరికల్‌ సన్నివేశాలు పెట్టడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా యుఎస్‌ఎలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు ఇన్విటేషన్‌ అందడంతో రాజశేఖర్‌, జీవిత దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. ఈ వేడుకల్లో పాల్గొనడమే కాదు... స్టేజీపై డాన్స్‌ కూడా చేశారు. పవన్‌కళ్యాణ్‌ సినిమాలలోని పాటలకు కూడా రాజశేఖర్‌ డాన్స్‌ చేయడం గమనార్హం. ఈ వేడుకల్లో రాజశేఖర్‌, జీవిత కూతుర్లు శివాని, శివాత్మికలు కూడా పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ