సినిమా హిట్టైతే ఆ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉత్సాహంగా మరిన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తాడు. అదే ఫ్లాపైతే అప్పులు తీర్చుకుంటూ, సెల్‌ఫోన్ కట్టేసి, ఫోన్‌లు ఎత్తడానికి కూడా భయపడే సిట్యూయేషన్స్ ఏర్పడుతుంటాయి ముఖ్యంగా భారీ సినిమాలు చేసేటప్పుడు అవి కనుక రిజల్ట్ తేడా వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితే తమిళం చిత్రం 'పులి' నిర్మాతలకు ఏర్పడింది. అసలే తాము భారీగా తీసిన చిత్రం ఫ్లాప్ అయిందని బాధపడుతుంటే అందులో కీరోల్ పోషించిన నటి శ్రీదేవి తనకు లాస్ట్ చెక్ క్లియర్ కాలేదని, తనకు 50లక్షలు ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో కేసు వేసింది. దానికి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నిర్మాతలకు సాయం చేయాలని భావించింది అందులో ఓ హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్. శృతి తన లాస్ట్ చెక్ 20లక్షలు ఇక చెల్లించనక్కర్లేదని నిర్మాతకు వెనక్కి పంపేసింది. మరో కీరోల్ చేసిన సుదీప్ కూడా ఇలాగే లాస్ట్ చెక్ తీర్చవద్దని వెనక్కి పంపినట్లు సమాచారం. ఔదార్యం అంటే అలా ఉండాలని, వీరిని చూసైనా శ్రీదేవి బుద్దితెచ్చుకోవాలని తమిళ నిర్మాతలు శ్రీదేవి వైఖరిని తప్పుపడుతూ, శృతి, సుదీప్‌లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.