Advertisementt

పవన్‌ సెంటిమెంట్‌పై రవితేజ ఆశలు..!

Sat 14th Nov 2015 04:49 PM
raviteja,pawan kalyan,sampath nandi,bengal tiger movie  పవన్‌ సెంటిమెంట్‌పై రవితేజ ఆశలు..!
పవన్‌ సెంటిమెంట్‌పై రవితేజ ఆశలు..!
Advertisement
Ads by CJ

హిట్టయినా, ఫ్లాపయినా వేరే సంగతి. కానీ సినిమా వాళ్లకు మాత్రం సెంటిమెంట్లు ఎక్కువ. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను మాస్‌మహారాజా రవితేజ నమ్ముతున్నాడు. పవన్‌కళ్యాణ్‌ నో చెప్పిన సినిమాలన్నీ సూపర్‌హిట్లుగా నిలిచాయని...ఇది టాలీవుడ్‌ చరిత్ర చెబుతున్న నగ్నసత్యమనీ... తాజాగా రవితేజ నటిస్తున్న 'బెంగాల్‌టైగర్‌'ను కూడా దర్శకుడు సంపత్‌నంది పవనే కోసమే తయారు చేశాడనే విషయాన్ని సినీ వర్గాలు వెలిబుచ్చుతున్నాయి. ఇదే సెంటిమెంట్‌ కనుక మరోసారి రిపీట్‌ అయితే 'బెంగాల్‌టైగర్‌'కు తిరుగుండదని రవితేజ నమ్ముతున్నాడు. గతంలో పవన్‌కు స్టోరీ చెప్పి... ఆయన చేత నో అనిపించుకున్న 'ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, మిరపకాయ్‌' చిత్రాలు ఘనవిజయం సాధించాయి.. ఈ చిత్రాల ద్వారా ఎక్కువగా లాభపడిందని రవితేజనే అని, ఇప్పుడు అదే ఫీట్‌ రిపీట్‌కానుందని సెంటిమెంట్‌ రాయుళ్లు బలంగా నమ్ముతున్నారు. ఇక 'పోకిరి, అతడు' చిత్రాలు కూడా పవన్‌ నో చెప్పిన తర్వాతే మహేష్‌ వద్దకు చేరి సూపర్‌హిట్‌ అయిన విషయాన్ని కూడా వారు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి రవితేజకు పవన్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలంటే 'బెంగాల్‌టైగర్‌' రిలీజ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ