Advertisementt

సల్మాన్‌ గొప్పదనం ఇదే..!

Sat 14th Nov 2015 04:04 PM
salman khan,hero movie,tiger,shera son,katrina kaif  సల్మాన్‌ గొప్పదనం ఇదే..!
సల్మాన్‌ గొప్పదనం ఇదే..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ కండల వీరుడు చూడటానికి రఫ్‌గా కనిపిస్తాడే గానీ ఆయన మనసు మాత్రం వెన్న అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఆయన తనకున్న ఛరిష్మాతో ఇప్పటికే ఎందరో హీరోయిన్లకు, హీరోలకు, దర్శకనిర్మాతలు లిఫ్ట్‌ ఇచ్చాడు. ఇటీవలే 'హీరో' అనే చిత్రాన్ని తన సొంత బేనర్‌లో సూరజ్‌పంచోలిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇంతేకాదు.. కత్రినా, రణవీర్‌సింగ్‌, రణభీర్‌సింగ్‌, దీపికా పడుకొనే వంటి పలువురు ఆయన వల్ల లభ్ది పొంది ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్స్‌గా వెలుగుతున్నారు. తాజాగా ఆయన తానే నిర్మాతగా మరో హీరోను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ కుర్రాడు ఆయన బంధువు కాదు.. సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్‌ ఉన్నవాడు కాదు. తనకు 15ఏళ్లుగా బాడీగార్డ్‌గా పనిచేస్తున్న షేరా తనయుడు అతను, షేరా కొడుకు టైగర్‌కు సినిమాలపై ఉన్న ఆసక్తి గమనించిన సల్మాన్‌ టైగర్‌ను తానే హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి తన బాడీగార్డ్‌ కొడుకును కూడా హీరోగా తానే సొంతగా పరిచయం చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శమని బాలీవుడ్‌ వర్గాలు సల్మాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. కానీ సల్మాన్‌ మాత్రం ఆ ప్రశంసలకు పొంగిపోకుండా అది నా బాధ్యత అంటూ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు సల్మాన్‌.