Advertisementt

కమల్‌హాసన్‌ మీద శృతిహాసన్‌దే పైచేయి.!

Sat 14th Nov 2015 11:21 AM
telugu movie cheekati rajyam,tamil movie vedalam,ajith in vedalam,sruthi haasan in vedalam,vedalam first day collections,toongavanam first day collections  కమల్‌హాసన్‌ మీద శృతిహాసన్‌దే పైచేయి.!
కమల్‌హాసన్‌ మీద శృతిహాసన్‌దే పైచేయి.!
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌ మీద శృతిహాసన్‌ది ఏ విధంగా పైచేయి అనేది తెలుసుకోవాలంటే ఈ దీపావళికి తమిళ్‌లో విడుదలైన తూంగవానం, వేదాలమ్‌ చిత్రాల ఫలితాలు ఎలా వున్నాయి? వాటి వసూళ్ళు ఎలా వున్నాయనేది తెలుసుకోవాలి. తెలుగు, తమిళ భాషల్లో కమల్‌హాసన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం తమిళ్‌లో తూంగవానంగా నవంబర్‌ 10న విడుదలైంది. తెలుగులో చీకటిరాజ్యంగా నవంబర్‌ 20న విడుదల కాబోతోంది. నవంబర్‌ 10న అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన వేదాలమ్‌ చిత్రం కూడా విడుదలైంది. ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. తూంగవానం ఏవరేజ్‌ మూవీ అనిపించుకోగా, వేదాలమ్‌ మాత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. మొదటిరోజే 15 కోట్ల 50 లక్షలు కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తూంగవానం మొదటి రోజు 4 కోట్ల 50 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

కమల్‌హాసన్‌ హీరోగా నటించిన తూంగవానం, శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన వేదాలమ్‌ ఒకేరోజు రిలీజ్‌ అవ్వడం, కలెక్షన్లపరంగా శృతిహాసన్‌ సినిమా కమల్‌హాసన్‌ సినిమాని మించిపోవడం తమిళ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. అజిత్‌ ఇమేజ్‌, డైరెక్టర్‌ శివ టేకింగ్‌, మేకింగ్‌ వేల్యూస్‌ వల్ల వేదాలమ్‌ పెద్ద హిట్‌ అయినప్పటికీ ఆ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించడం వల్ల ఇలా లెక్కలు వేస్తున్నారు తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ