గత కొంతకాలంగా 'సర్దార్‌గబ్బర్‌సింగ్' షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్ ఎప్పుడూ పోలీస్ డ్రెస్‌లోనే కనిపించే వాడు. ఆమద్య చిరంజీవిని కలిసినప్పుడు వచ్చిన సందర్బంలోనూ మరో సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన పోలీస్ డ్రస్‌లోనే కనిపించాడు. అయితే ఉన్నట్లుండి పవన్ చంద్రబాబుతో భేటీ అయిన సందర్బంలో పంచెకట్టుతో కనిపించాడు. చంద్రబాబును కలిసేందుకు ఆయన ప్రత్యేకంగా పంచెకట్టుతో రావడానికి ఓ కారణం ఉందని అంటున్నారు. పవన్ ఇంట్లో కార్తీక మాసం పూజలు మొదలయ్యాయని, గురువారం ఉదయం ఇంట్లో జరిగిన కార్తీకమాసం పూజల కోసం పవన్ మన సంప్రదాయానికి తగ్గట్లుగా తెల్ల దుస్తులు ధరించాడట. దాంతో అదే డ్రస్సులో విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిశాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు పవన్ నిష్ఠతో ఒంటిపూట భోజనం చేస్తారని తెలుస్తోంది. ఈ నెలరోజుల పాటు పవన్ ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయని సమాచారం.