Advertisementt

మహేష్‌ను టెన్షన్‌ పెడుతోన్న పవన్‌..!

Fri 13th Nov 2015 11:08 PM
mahesh babu,brahmothsawam,pawan kalyan,sardhar gabbar singh  మహేష్‌ను టెన్షన్‌ పెడుతోన్న పవన్‌..!
మహేష్‌ను టెన్షన్‌ పెడుతోన్న పవన్‌..!
Advertisement
Ads by CJ

సంక్రాంతికి విడుదల కావాల్సిన పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ మొదలుకావడమే లేటవ్వడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సమ్మర్‌కు షిఫ్ట్‌ అయింది. ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తారని చిత్రబృందం చెబుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే తన 'బ్రహ్మొత్సవం' కూడా వేసవి బరిలోనే దిగనుంది. తన సినిమాకి ముందు, వెనుక మరో పెద్ద సినిమా లేకుండా చూసుకోవడం మహేష్‌కు అలవాటు. 'శ్రీమంతుడు' చిత్రం విషయంలో ఈ ట్రిక్‌ బాగా పనిచేసి కోట్లు కొల్లగొట్టింది. పోటీ లేకుండా వచ్చిన మహేష్‌ ఏకంగా వందకోట్లు పట్టుకెళ్లాడు. ఇప్పుడు  'బ్రహ్మొత్సవం'కు కూడా అదే ట్రిక్‌ ప్లే చేయనున్నాడు మహేష్‌. అయితే ఈ చిత్రానికి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పోటీలో ఉండటంతో 'సర్దార్‌' ఎప్పుడొచ్చేది తెలిస్తే తన 'బ్రహ్మొత్సవం' సినిమాకి డేట్‌ లాక్‌ చేయోచ్చు అనుకొంటున్నాడట. అయితే సర్దార్‌ లేటయ్యే కొద్ది కన్‌ఫ్యూజన్‌ ఏర్పడి  'బ్రహ్మొత్సవం' రిలీజ్‌ డేట్‌ కూడా కన్‌ఫ్యూజన్‌లో పడే అవకాశం ఉండటంతో రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వాలని పివిపి సంస్థ శరత్‌మరార్‌ని కోరిందట. దీంతో మరో వారంలో 'సర్దార్‌' రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇస్తానని శరత్‌మరార్‌ పివిపి సంస్థకు మాటిచ్చాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ