ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండి అందరినీ ఆకట్టుకుంటున్న యువహీరో రాజ్‌తరుణ్. ఆయన 'ఉయ్యాల జంపాల' చిత్రానికి కేవలం 10లక్షల పారితోషికం పొందాడు. కాగా ఆచిత్రంతో పాటు ఇటీవల ఆయన నటించిన 'సినిమా చూపిస్త మావా' అనే చిత్రం సూపర్‌హిట్టు అయి దాదాపు 10కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే ఉంది. ప్రస్తుతం అతని చేతిలో మంచి మంచి ప్రాజెక్ట్స్ వున్నాయి. సుకుమార్ 'కుమారి 21ఎఫ్'తో పాటు గీతాఆర్ట్స్ సినిమా,పెద్ద వంశీతో 'లేడీస్‌టైలర్' రీమేక్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అతనితో కేవలం మూడు నాలుగు కోట్లతో సినిమా తీసి హిట్టయితే ఏకంగా 10కోట్లకుపైగా లాభాలు ఆర్జించవచ్చనేది నిర్మాతల ఆలోచన. కాగా ప్రస్తుతం రాజ్‌తరుణ్ ఒక సినిమాకు 50 నుండి 60లక్షలు వసూలు చేస్తున్నాడు. మరో వారంలో రానున్న 'కుమారి 21ఎఫ్' కనుక హిట్టయితే ఇక తన రెమ్యూనరేషన్‌కు కోటికి పెంచాలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి ఈ కుర్రాడు భలే అదృష్టవంతుడనే చెప్పాలి. అయితే గతంలో వరుణ్‌సందేశ్‌కు కూడా ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. కానీ స్టోరీల సెలక్షన్‌పై దృష్టి పెట్టకుండా కేవలం రెమ్యూనరేషన్‌పైనే దృష్టి పెట్టడంతో ఆయన కెరీర్ పడిపోయింది. ఇలా ఉదాహరణగా చెప్పుకోవాలంటే చాలా పేర్లు ఉన్నాయి. గతంలో ఇలా దెబ్బతిని కనుమరుగైన వారి నుండి రాజ్‌తరుణ్ ఓ గుణపాఠంగా తీసుకోవాలని విశ్లేషకులు, ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.