తెలుగులో 'శౌర్యం' సినిమాతో డైరెక్టర్ గా మారాడు శివ. ఆ తరువాత ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించకపోవడంతో తమిళనాడుకు వెళ్లి అక్కడ టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. రీసెంట్ గా శివ, అజిత్ ను హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన 'వేదలమ్' సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 'వేదలమ్' కు ముందే శివ, అజిత్ కు 'వీరమ్' వంటి హిట్ సినిమానిచ్చాడు. ఈ క్రమంలో అజిత్ తన తదుపరి చిత్రం కూడా తనకు రెండు బిగ్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి లాంఛనంగా ప్రారంభించనున్నారు. సినిమాకు సంబంధించిన నిర్మాణ విషయాల గురించి తెలియాల్సివుంది. 'ఆరంభం', 'ఎన్నై అరిందాల్','వేదలమ్' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అజిత్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉంటాయి.