మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తాను హీరోగా నటించే చిత్రాల్లో తనకు తోడుగా ఎవరినో ఒకరిని తెచ్చుకుంటున్నాడు. ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాలనే కసితో ఉన్న ఆయన చిరు, రాజమౌళి సాయంతో అప్పుడెప్పుడో 'మగధీర'తో అనుకున్నది సాదించాడు. తాజాగా కూడా తనకు సింగిల్‌గా బ్లాక్‌బస్టర్ కొట్టే సత్తా లేదని అనుకుంటున్నాడో ఏమో గానీ తర్వాత తన చిత్రాలతో ఒంటరిగా కాకుండా ఎవరో ఒకరిని అరువు తెచ్చుకుంటున్నాడు. 'ఎవడు' చిత్రంలో అల్లుఅర్జున్‌ను తోడుగా తీసుకొని వచ్చిన ఆయన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్‌ల సాయం తీసుకోవాలనుకున్నాడు. కానీ చివరకు శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్‌లతో సరిపెట్టుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన 'బ్రూస్‌లీ' చిత్రంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చాడు. ఇక త్వరలో చేయబోయే 'తని ఒరువన్' రీమేక్‌లో విలన్ పాత్రను నాగార్జున చేత చేయించాలనే తపనలో ఉన్నాడు. కానీ చివరకు ఆయన అరవింద్‌స్వామితోనే వచ్చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి తనకు వీలున్నంతలో మంచి సపోర్టింగ్ అండ్ క్రేజీ నటీనటులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఆయన కోరిక మాత్రం నెరవేరడం లేదు. మెగా ఫ్యాన్స్ అండతో..తన హీరోయిజం ఏంటో సింగిల్ గా చూపించి..ప్రత్యర్ధులను బయపెట్టాల్సిన రామ్ చరణ్..ఇలా సపోర్ట్ కోసం ప్రాకు లాడటం ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదు. కొందరైతే అస్సలు రామ్ చరణ్ చేస్తుంది రైటేనా..? అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు.