వైవిధ్యమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ వరుస సక్సెస్‌లతో వున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘శంకరాభరణం’. ఈ చిత్రానికి కథ,స్కీన్‌ప్లే,మాటలు అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు కోనవెంకట్. సెన్సారును కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదట కోన వెంకట్‌తో సినిమా అనగానే ఎగిరి గంతేసిన నిఖిల్ ఇప్పుడ ఆయన వల్లే టెన్షన్‌లో పడ్డాడు. ఇటీవల కోన రచయితగా పనిచేసిన బ్రూస్‌లీ, త్రిపుర, తాజాగా అఖిల్ చిత్రాల ఫలితాలు చూసి నిఖిల్ టెన్షన్ పడుతున్నాడు. గత కొద్దికాలంగా సక్సెస్‌ట్రాక్‌లో వున్న తనకు ‘శంకరాభరణం’ విజయాన్ని అందిస్తుందో లేదోనని ఆందోళనకు గురవుతున్నాడు. అందుకే సినిమా పబ్లిసిటిపై దృష్టి పెట్టి.. మంచి ఓపెనింగ్స్ రావాలని నిఖిల్ తెగ ప్రయత్నిస్తున్నాడట.