దీపావళి కానుకగా నవంబర్ 11న అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి నెగటివ్ టాక్ వస్తోంది. అఖిల్ డాన్సులు, ఫైట్స్ కోసం మాత్రమే సినిమా తీసినట్లుందని, కథ ఏ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి మొదట ఈ సినిమా చూసిన నాగార్జున కొన్ని సీన్లు మార్చమని సలహా ఇచ్చాడు. సినిమాలో కొన్ని మార్పులు చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగ్ భావించాడట. కాని తన మాట వినకుండా అఖిల్ పట్టుబట్టడంతో సినిమాను దీపావళి కు రిలీజ్ చేసేసారు. సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో ఇప్పుడు అఖిల్.. నాన్న మాట వింటే బావుండేదని ఫీల్ అవుతున్నాడట.