నితిన్ ని ఫ్లాప్ నుండి హిట్ స్థాయి కి చేర్చిన భామగా నిత్యమీనన్ కి పేరున్న విషయం తెలిసిందే. మరి సందీప్ కిషన్ స్టాటస్ ని కూడా ఈ భామ మార్చుతుందా!. విషయం లోకి వస్తే.. రచయిత రాజసింహాను దర్శకునిగా పరిచయం చేస్తూ సందీప్‌కిషన్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఒక్క అమ్మాయి తప్ప' అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేశారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. పలువురు అప్‌కమింగ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే మా సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని త్వరలో ఆమె పేరును ప్రకటిస్తామని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడా స్టార్ హీరోయిన్ ఎవరనది తెలిసింది. నిత్యామీనన్‌ను ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేయడానికి సంప్రదించినట్లు, ఆమె కూడా ఓకే చేసినట్లు సమాచారం. నిత్యామీనన్‌కు సినిమా కథని, అందులోని ఆమె పాత్ర ప్రాముఖ్యతను వివరించి ఆమెను ఒప్పించే పనిలో మునిగిన దర్శకుడు రాజసింహా ఎట్టకేలకు ఆమె చేత ఓకే అనిపించుకున్నాడని తెలుస్తోంది.