Advertisementt

రామ్‌చరణ్‌కి..ఇప్పటికి తెలిసొచ్చింది!

Thu 12th Nov 2015 06:43 PM
ram charan,pawan kalyan,mahesh babu,remuneration,thani oruvan,surendar reddy,ram charan follows pawan and mahesh  రామ్‌చరణ్‌కి..ఇప్పటికి తెలిసొచ్చింది!
రామ్‌చరణ్‌కి..ఇప్పటికి తెలిసొచ్చింది!
Advertisement
Ads by CJ

అనుభవాన్ని మించిన గుణపాఠం లేదు. అది రామ్‌చరణ్‌కు 'బ్రూస్‌లీ'తో తెలిసివచ్చింది. తన సినిమాలు పెద్దగా లాభాలు ఆర్జించిపెట్టకపోవడానికి కథల ఎంపికతో పాటు ఓవర్‌బడ్జెట్‌ కూడా ఓ ముఖ్యకారణం అని రామ్‌చరణ్‌కు అర్థం అయింది. దీంతో త్వరలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తాను చేయనున్న 'తని ఒరువన్‌' రీమేక్‌ విషయంలో రామ్‌చరణ్‌ బోలెడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందుకోసం బడ్జెట్‌ను అదుపులో పెట్టడానికి తన రెమ్యూనరేషన్‌ వదులుకోవడానికి సైతం చరణ్‌ సిద్దపడుతున్నాడు. పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబుల లాగా పారితోషికం తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇలా చేస్తే నిర్మాతకు బడ్జెట్‌ తగ్గుతుంది. షేర్‌ తీసుకోవడం వల్ల రామ్‌చరణ్‌ బాధ్యత పెరుగుతుంది. దీనివల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నప్పటికీ సినిమాలో తను కీలకపాత్ర పోషించాలంటే లాభాల్లో వాటా తీసుకొని పవన్‌కళ్యాణ్‌,మహేష్‌బాబుల రూట్‌లో వెళ్లడమే ఉత్తమమని రామ్‌చరణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌ తగ్గడానికి, నష్టాలను పూడ్చడానికి రిస్క్‌ తప్పదని గ్రహించిన చరణ్‌ ఇకపై తాను కూడా సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ