అక్కినేని అఖిల్ తెరంగేట్రం జరిగిపోయింది. సినిమా ఎలా ఉన్నా అక్కినేని అఖిల్ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. నందమూరి వారసుడు మోక్షజ్ఞపై అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నాకు పోటీ కేవలం నందమూరి మోక్షజ్ఞే అని ప్రకటించాడు. మీకు పోటీ ఎవరు? అని ప్రశ్నిస్తే కథానాయకుడిగా రాబోతున్న నందమూరి మోక్షజ్ఞ అని సెలవిచ్చాడు. ఇలా మోక్షజ్ఞ పేరు చెప్పడం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. మోక్షజ్ఞ పేరు చెప్పి నందమూరి అభిమానులకు దగ్గరవుదామని అఖిల్ ప్రయత్నిస్తున్నాడనే టాక్ మొదలైంది. అఖిల్ మాటల్లో మర్మం ఏదైనా... మోక్షజ్ఞ పేరు అఖిల్ నోట వినగానే నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అంతకుముందు మెగాస్టార్ డాన్సుల గురించి చెప్పి..మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం అఖిల్ చేసిన విషయం తెలిసిందే..!