పబ్లిక్ ఫంక్షన్లలో అలీ రెచ్చిపోవడం ఆపై నెటిజన్లు అలీని రకరకాలుగా ఆడుకోవడం, మహిళా సంఘాలు గుర్రుమనడం సాగుతోంది. సమంత బొడ్డు, అనుష్క తొడలను టార్గెట్ చేసి అలీ మాట్లాడటం వివాదాస్పదమైన నేపథ్యంలో ఇక తను ఆడియో ఫంక్షన్లలో మాట్లాడకూడదని అలీ ఒట్టువేసుకొన్నాడట. అంతేకాదు... తనపై విమర్శలు కురిపించిన వారిని అలీ వదిలిపెట్టనని ప్రతినబూనాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ముఖ్యంగా అన్నపూర్ణ సుంకరపై అలీ లీగల్‌గా ప్రోసీడ్ అవ్వాలని భావిస్తున్నాడు. అలీని వ్యక్తిగతంగా కూడా అన్నపూర్ణ సుంకర ఓ లెవల్లో ఆడేసుకొంది. 'నువ్వు మనిషివా.. దున్నపోతువా.?' అంటూ ఘాటైన పదజాలంతో దూషించింది. అంతేకాదు... 'నీకసలు డాక్టరేట్ ఇచ్చారా? లేక కొనుక్కున్నావా?' అంటూ రెచ్చిపోయింది. దీంతో అలీ మనస్తాపానికి గురయ్యాడు. అందుకే లీగల్‌గా అన్నపూర్ణపైన తనపై కామెంట్లు చేసిన వాళ్లపైనా యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.