Advertisementt

సినీ ఇండస్ట్రీ కి ఈ యూనిటీయే కావాలి!

Thu 12th Nov 2015 12:21 PM
tollywood young heroes,allu arjun,rana,problems,secret meetings,new trend  సినీ ఇండస్ట్రీ కి ఈ యూనిటీయే కావాలి!
సినీ ఇండస్ట్రీ కి ఈ యూనిటీయే కావాలి!
Advertisement
Ads by CJ

మొత్తానికి మన కుర్రహీరోలు సరికొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు. యువహీరోలందరూ కలిసి సినిమా ఇండస్ట్రీ బాగోగులు, రెమ్యూనరేషన్లు, బడ్జెట్‌లు, ఒకరిపై ఒకరు సినిమాల విడుదలలో పోటీపడకుండా గ్యాప్‌ తీసుకొని సినిమాలను విడుదల చేయడం.. ఇలా పలు సమస్యలపై ఒకరికొకరు డైరెక్ట్‌గా కూర్చొని చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలకు ఫామ్‌హౌజ్‌లు వేదికగా మారుతున్నాయి. ఇకపై కూడా తమ రహస్య సమావేశాలను నిర్వహించుకోవడానికి నిర్ణయించుకున్నారు. మొదటి మీటింగ్‌ హీరో రానా నేతృత్వంలో జరిగింది. ఇక ఇటీవలే అల్లుఅర్జున్‌తో ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి దాదాపు 40 మంది హీరోహీరోయిన్లు హాజరైనట్లు సమాచారం. అయితే ఈ సమావేశాలను సీక్రెట్‌గా జరపాలని, వీటి విషయంలో ఎవ్వరూ మీడియా ముందు మాట్లాడకూడదని, ఫొటోలను కూడా షేర్‌ చేయకూడదని కండీషన్స్‌ పెట్టుకున్నారు. ఇలా అందరూ స్టార్‌ హీరోలు ఎలాంటి ఇగోలు లేకుండా కలిసి కట్టుగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించడం మంచి శుభపరిణామంగా కనిపిస్తోంది. గతంలో ఇలాంటి మీటింగులను తమిళ నటీనటులు కూడా జరిపి తమ మధ్య ఉన్న వైరాలను తొలగించుకొన్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ