కన్నడ సూపర్ స్టార్ సుదీప్ 'ఈగ','బాహుబలి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమయ్యాడు. ఇటీవలే సుదీప్ కు, తన భార్యతో విభేదాలు ఏర్పడడం వలన పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుదీప్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. నిత్యమీనన్, సుదీప్ సరసన నటిస్తుంది. అయితే వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారిందని కోలీవుడ్ వర్గాల ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నిత్య, సుదీప్ తో చాలా చనువుగా ఉంటుందట. అంతేకాదు ప్రతి ఫంక్షన్ కు వీరిద్దరూ కలిసే వెళ్తున్నారని సమాచారం. ఈ విషయాల గురించి కన్నడ పత్రికలు ప్రతి రోజు వార్తలు రాస్తూనే.. ఉన్నాయి. మరి ఈ విషయంపై సుదీప్, నిత్యలు ఎలా స్పందిస్తారో.. చూడాలి!