Advertisementt

నారా వారికి నందమూరి విలన్

Tue 10th Nov 2015 04:04 PM
nara rohit,nandamuri taraka rathna,raja cheyyi vesthe  నారా వారికి నందమూరి విలన్
నారా వారికి నందమూరి విలన్
Advertisement
Ads by CJ

నారా రోహిత్ కెరీర్ జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఓ ఏడెనిమిది సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటే మరికొన్ని సెట్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కొత్త దర్శకుడు ప్రదీప్ చేస్తున్న రాజా చెయ్యి వేస్తే మూవీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. వారాహి బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి గారు నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి యాక్షన్ పంథాలో సాగబోతున్నట్టు తెలుస్తోంది. నారా కుర్రాడికి పోటాపోటీగా పవర్ ఫుల్ విలన్ కోసం వేటను కొనసాగించిన దర్శకుడు ప్రదీప్ ఎట్టకేలకు నందమూరి తారకరత్నను ఎంపిక చేసినట్టు ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు. రవిబాబు దర్శకత్వంలో ఇంతకు మునుపు ఓసారి అమరావతి అనే చిత్రంలో సైకో విలనుగా చేసిన తారకరత్న అటు తరువాత ఎటు కాకుండా పోయాడు. రాజా చెయ్యి వేస్తేతో మళ్ళీ కెరీర్ ప్రారంభించాలనుకున్న తారకరత్న ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సినిమా ఘనవిజయం సాధింఛి తీరాలి. నందమూరి వంశంలో హీరోలే కాదండోయ్ విలన్లు కూడా పుట్టుకొస్తున్నారు. ఏదైతే ఏందీ... అంతా నటనలో భాగమేగా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ