Advertisementt

ఈసారి అజిత్‌ వంతు..!

Mon 09th Nov 2015 08:14 PM
ajith,vedalam movie leaked,sruthihasaan,attharintiki daredi  ఈసారి అజిత్‌ వంతు..!
ఈసారి అజిత్‌ వంతు..!
Advertisement
Ads by CJ

ఒకవైపు పైరసీ.. మరో వైపు లీకేజీలతో యావత్‌ భారత సినీ పరిశ్రమ వణికిపోతోంది. కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఈ విధంగా జరగడం దారుణమని అందరూ అభిప్రాయపడుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' ఫస్టాఫ్‌ బయటకు వచ్చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తమిళ నాట అజిత్‌ సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. అజిత్‌ హీరోగా నటిస్తున్న 'వేదలమ్‌' చిత్రంలోని కొన్నిసీన్లు లీకయ్యాయి. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో ఓపెనింగ్స్‌ సీన్లన్నీ ఒక్కోక్కటిగా సోషల్‌ మీడియా నెట్‌ వర్కింగ్‌ సైట్లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తమ సినిమా లీకవుతోందని విషయం గుర్తించిన నిర్మాత ఎ.యం.రత్నం పోలీసులను ఆశ్రయించాడు. ఈ సన్నివేశాలు బయటకు ఎలా వచ్చాయి? అనే విషయంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొన్ని సీన్లే బయటకు వచ్చాయా? లేక సినిమా మొత్తం లీకైందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అజిత్‌ సినిమా కావడం, ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్‌ ఉండటంతో లీక్‌ అయిన కూడా పెద్దగా నష్టం ఏమీలేదని కోలీవుడ్‌ ప్రముఖులు అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ