Advertisementt

సూర్య ఆశ నెరవేరుతుందా..?

Mon 09th Nov 2015 08:11 PM
suriya,24 movie,vikram k kumar,rakshasudu,sikindar  సూర్య ఆశ నెరవేరుతుందా..?
సూర్య ఆశ నెరవేరుతుందా..?
Advertisement
Ads by CJ

తమిళస్టార్‌ హీరో సూర్యకు ప్రయోగాలంటే మక్కువ ఎక్కువ. ఎప్పటికప్పుడు తన చిత్రాలలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. అన్ని జోనర్‌ సినిమాలను చేస్తుంటాడు. కానీ అదృష్టం అతనికి కలిసి రావడం లేదు. ఏ జోనర్‌లో చేసిన సినిమాలైనా ఆయనకు హిట్స్‌ను ఇవ్వలేకపోతున్నాయి. వాస్తవానికి గత ఐదేళ్లలో ఆయన కెరీర్‌లో 'సింగం, సింగం2' మాత్రమే హిట్స్‌. మిగతావన్ని పరాజయం పాలయ్యాయి. 'సెవెన్త్‌సెన్స్‌, బ్రదర్స్‌, సికిందర్‌, రాక్షసుడు..' ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతోంది. కాగా ఆయన ప్రస్తుతం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేస్తున్నాడు. '24' అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి 'మనం' డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రం అద్బుతంగా వచ్చిందంటూ కోలీవుడ్‌లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఇది కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమే. టైమ్‌మెషీన్‌ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా పూర్తి చేసి త్వరలో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా సూర్య కల నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది. ఈ చిత్రంపై సూర్య బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు మరి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ