Advertisementt

మా నాన్నకు జాండీస్: వరుణ్ తేజ్

Mon 09th Nov 2015 05:07 PM
loafer trailer,varun tej,loafer trailer review  మా నాన్నకు జాండీస్: వరుణ్ తేజ్
మా నాన్నకు జాండీస్: వరుణ్ తేజ్
Advertisement
Ads by CJ

దర్శకుడు పూరి జగన్నాథ్ పెన్ను కదిపితే ఒకటేంటి అన్ని రసాలు వాటంతటవే ప్రవాహంలా తన్నుకొస్తాయి. టెంపర్ తరువాత కాస్తంత లేట్ అయినా వరుణ్ తేజని మాస్ హీరోగా పరిచయం చేసే క్రమంలో లోఫర్ స్పష్టంగా అభిమానులను అలరించబోతోంది అన్న సంగతి రాత్రి పూరి విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. కథంతా పూరీ చెప్పినట్టే చెప్పి ఏం దాచాలో దాచాడు. ఓ అమ్మగా రేవతి, తాగుబోతు నాన్నగా పోసాని, లోఫర్ కొడుకులా వరుణ్ తేజ్. చిన్నప్పుడే అమ్మ నుండి విడిపోయిన కొడుకు మళ్ళీ ఆ తల్లిని కలుసుకోవడం కోసం చేసిన ప్రయానంగా లోఫర్ కనపడుతోంది. మీ అమ్మకు జాండీస్, నా కొడుకుకు జాండీస్, మా అమ్మ జాండీసుతో చచ్చిపోయింది అన్న సీరియస్ అంశాన్ని కూడా కామెడీ చేసేసాడు పూరీ. చెబితే ఏం ఉంటుంది మజా, ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మొత్తానికి లోఫర్ ట్రైలర్ మెగా అభిమానులను అలరిస్తుంది, వరుణ్ తేజను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ