చిరంజీవికి రాజకీయం అచ్చిరాలేదని మనం ఈరోజు కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, తెలుగు రాష్ట్రంలో మహనీయుడు ఎన్టీయార్ తరువాత అంతటి రాజకీయ తుఫానులా వస్తాడనుకున్న మెగాస్టార్ ఎందుకూ కొరగాకుండా పోయారు. సినిమాల్లో సంపాదించుకున్న ఎనలేని కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఈరోజు దాపురించింది అంటే అది కేవలం ప్రజారాజ్యం అనే పేరుతో చిరంజీవి అప్పట్లో తీసుకున్న తొందర అండ్ తప్పుడు నిర్ణయం వల్లే అని ఆయన వీరాభిమానులు కూడా ఓ సందర్భంలో ఒప్పుకున్నవాళ్ళే.
ప్రత్యేకించి మరోసారి ఈ సంగతి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే చిరంజీవిని అప్పట్లో అంటి పెట్టుకుని ఉన్న పెద్దాయన చేగొండి హరిరామ జోగయ్య గారు తాను రచించిన ఆత్మకథ పుస్తకంలో చిరును మరోసారి దుయ్యబట్టారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని వ్యాపారంగా నడిపారని, దీనితో అల్లు అరవింద్ గారికి ఎటువంటి సంబంధం లేదని వాకాల్తా పుచ్చుకొని మరి మాట్లాడారు. అలాగే చిరంజీవి కన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వంద రెట్లు మంచోడని చెప్పుకొచ్చారు. లోగుట్టు ఎవరికీ తెలీదు... చిరును తిడితే గాని ఆత్మ కథ అమ్ముడుపోదని తెలీదా జోగయ్యా గారూ...