Advertisementt

సౌతే సేఫ్ అనుకుంటున్న హాట్ భామ!

Mon 09th Nov 2015 09:20 AM
ileana,south industry,bollywood,ram charan,vijay,ileana eye on south  సౌతే సేఫ్ అనుకుంటున్న హాట్ భామ!
సౌతే సేఫ్ అనుకుంటున్న హాట్ భామ!
Advertisement
Ads by CJ

సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌హీరోయిన్‌గా వెలుగుతున్న దశలో ముఖ్యంగా టాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్‌లో తన అందచందాలతో, నడుము ఒంపులతో అక్కడ అవకాశాలు దక్కించుకోవాలని ఇల్లీబేబీ ఇలియనా స్కెచ్‌ వేసింది. కానీ అక్కడ ఆమె నటించిన చిత్రాలతో బాలీవుడ్ పెద్దగా రాణించలేదు. ఇలాంటి నడుము సుందరులను ఇప్పటికే ఎందరినో చూసిన బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆమె మురిపించలేకపోయింది. దాంతో ఆమె సౌత్‌ ఎక్స్‌ప్రెస్‌కు టిక్కెట్‌ రెడీ చేసుకుంటోంది. ఇటీవల బాలీవుడ్‌లో ఆమె నటించిన 'హ్యాపీఎండింగ్‌' చిత్రమైనా ఆమెకు హ్యాపీ డేస్‌ను అందిస్తుందని ఆశలు పెట్టుకున్న ఆమెకు ఆ చిత్రం బ్యాడ్‌డేస్‌ను అందించింది. ఇప్పుడు ఆమె చేతిలో బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో సౌత్‌ ఇండస్ట్రీ వైపు యూటర్న్‌ తీసుకొంటోంది. ఆమె త్వరలో విజయ్‌ సరసన నటించనున్నట్లు సమాచారం. గతంలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'స్నేహితుడు' చిత్రంలో ఆమె విజయ్‌ సరసన నటించింది. తాజాగా విజయ్‌ నటించే 60వ చిత్రంలో ఆమెకు హీరోయిన్‌ బెర్త్‌ ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ 'తని ఒరువన్‌' తెలుగు రీమేక్‌లో కూడా రామ్‌ఛరణ్‌ సరసన ఇల్లిబేబీనే నటించనుందనే వార్తలు వస్తున్నాయి. సో..... ఇకపై ఇలియానాను చూడాలనుకునే ప్రేక్షకులు బాలీవుడ్‌ చిత్రాల వైపు చూడకుండా తమిళ, తెలుగు భాషల్లో చూసే అవకాశం కలిగిస్తోంది ఈ గోవా బ్యూటీ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ