మన స్టార్ హీరోలు ఈసారి వచ్చే సంక్రాంతి పక్కనపెట్టి వేసవి సీజన్‌పై కన్నేశారు. ఇప్పటినుండే వచ్చే సమ్మర్‌కు కర్చీఫ్‌లు వేస్తున్నారు. ఈసారి సమ్మర్ సీజన్‌లో ముగ్గురు మొనగాళ్లు పోటీకి సిద్దమవుతున్నారు. అల్లుఅర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతాఆర్ట్స్ పతాకంపై అల్లుఅరవింద్ నిర్మిస్తున్న 'సరైనోడు' చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో రానుంది. ఇక మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం' కూడా ఏప్రిల్ 9న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా తన 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను వేసవికే ప్లాన్ చేస్తున్నాడు. సో.. ఇప్పటివరకు ముగ్గురు స్టార్ హీరోలు సమ్మర్‌పై కన్నేశారు. కాగా గత రెండేళ్లుగా వేసవి సీజన్‌లో 'రేసుగుర్రం, సన్నాఫ్‌సత్యమూర్తి' చిత్రాలతో 50కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకున్న బన్నీతో పాటు మహేష్, పవన్‌లు కూడా ఈ సారి అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు.