దర్శకుడు వినాయక్‌కు ఓ పెద్ద బాధ్యత తీరిపోయింది. ఆయన 'అఖిల్' సినిమాను పూర్తి చేశాడు. ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. కానీ వినాయక్ తదుపరి చిత్రంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడనే వార్తలు వస్తున్నా.. వినాయక్ మాత్రం ఆ సినిమా సంగతి తనకేమీ తెలియనట్లు తెలివిగా తప్పించుకుంటున్నాడు. ఆ ప్రశ్నను అడిగితే తెలివిగా మాట మార్చేస్తున్నాడు. చిరు సినిమా సంగతి ప్రస్తావించని వినాయక్ మహేష్‌బాబు సినిమాపై మాత్రం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మహేష్ కోసం ఓ మంచి సబ్జెక్ట్‌ను తయారు చేస్తున్నానని, కావాలంటే మహేష్ చిత్రం కోసం కొంత కాలం వెయిట్ చేస్తానని, ఆయనతో చేసే సినిమా మామూలుగా కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పాడు. మరి చిరు 150వ సినిమా సంగతి ఏమిటబ్బా? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది.