ఓ సినిమాను ఎంతలా మార్కెట్ చేసుకోవాలి, సామాన్య ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్సును కూడా థియేటర్లకు ఎలా రప్పించాలి అన్న అంశం మీద కుర్ర హీరో అఖిల్ బాగానే డీల్ చేస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ ఎలాగో అఖిల్ చిత్రాన్ని రిలీజ్ డే రోజే చూసేస్తారు. కానీ మిగతా హీరోలలో ఏ హీరో అభిమానులని పట్టుకుంటే ఎంతలా పనవుతుందో అఖిల్ సరిగ్గా అంచనా వేసినట్టున్నాడు. అందుకే ఒక్కసారి కాదు మీడియా వారు ఎప్పుడు అడిగితే అప్పుడు, సందు దొరికినప్పుడల్లా మెగా స్టార్ చిరంజీవి గారే డ్యాన్సులలో తనకు గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పుకొస్తున్నాడు. చిరు పేరు చెబితేనే ఊగిపోయే రెంజులో మెగా అభిమానులున్నారు కాబట్టి సోషల్ మీడియాలో చిరు గురించి అఖిల్ ఇచ్చిన స్టేట్మెంట్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ మాటకొస్తే అందరు కుర్ర హీరోలకు పోటీగా అఖిల్ కూడా మొదటి చిత్రంలోనే నృత్యాలలో కుమ్మేసాడు అన్న టాక్ తీవ్రంగా స్ప్రెడ్ అయింది. మాస్ జనాన్ని రుచి మరిగేలా చేస్తే బాక్సాఫీస్ ఎంతలా షేక్ అవుతుందో రేపు మెగా ఫ్యాన్స్ గనక అఖిల్ సినిమా హాల్స్ దగ్గర క్యూ కడితే ఇట్టే తెలిసిపోతుంది. ఆ విధంగా విడుదలకు ముందే అఖిల్ మెగా సపోర్ట్ పొందడానికి అర్హుడయ్యాడు.