Advertisementt

ఇదే లోఫర్ అవతారం

Sun 08th Nov 2015 12:26 PM
loafer first look,varun tej,puri jagannath,c kalyan  ఇదే లోఫర్ అవతారం
ఇదే లోఫర్ అవతారం
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న మూడో చిత్రం లోఫర్ చురుగ్గా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పూరీ జగన్నాథ్ ప్రస్తుత పరిస్థితిని గమనించి కూడా మెగా కుర్రాడిని అతడి అరచేతిలో పెట్టారంటే కేవలం మాస్ ఇమేజి పట్టం కట్టడం కోసమేనని గట్టిగా అనుకోవచ్చు. పూరీ చిత్రాల్లో విపరీతమైన హీరోయిజం, కేవలం హీరో సెంట్రికుగా సాగే కథనాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టుగానే పూరీ ఈ కథకు  ముందు నితిన్ గారిని హీరో అనుకోని ఆ తరువాత వరుణ్ తేజ వైపు మరల్చాడు. ఎలాగయితే ఏంది, వరుణ్ అదృష్టం పండింది. ఈ రోజు విడుదలైన లోఫర్ మొదటి ప్రచార చిత్రంలో వరుణ్ తేజ్ లుక్కు అదిరిపోయిందన్న టాక్ వచ్చేస్తోంది. వరుణ్ రెండో మూవీ కంచెకు మంచి టాక్ రావడంతో లోఫరుకు ఆటోమేటిగ్గా మార్కెట్ డెవలప్ అయింది. ఇక ఈ రక్తం చిందుతున్న యాక్షన్ టచ్చుతో బిజినెస్ పీక్స్ చేరే అవకాశం ఉంది. నిర్మాత సి కళ్యాణ్ గారు ఇక తడి గుడ్డేసి పడుకోవచ్చేమో...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ